AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పేదల బతుకులు మారాలంటే కాంగ్రెస్‌ రావాలె


అవినీతి పోవాలంటే బీఆర్‌ఎస్‌ పోవాలె
సంక్షేమాన్ని మరిచిన జోగురామన్నకు బుద్ధిచెప్పాల్సిందే
తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాగాంధీదే..
కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కంది శ్రీనివాస రెడ్డి
అంకాపూర్‌ లో నాయకులు, కార్యకర్తలతో సమావేశం

ఆకాంగ్రెస్‌ పార్టీ పేదల పార్టీ అని అది అధికారంలోకి వస్తేనే ప్రజల బతుకులు మారతాయని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం అంకాపూర్‌ గ్రామంలో ఆయన పర్యటించారు. కాంగ్రెస్‌ శ్రేణులు, గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ఆలయ ఆవరణలో కంది శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్‌ నాయకులు ,కార్యకర్తలు ,గ్రామస్తులతో సమావేశ మయ్యారు. ఇక్కడి ప్రజల సంక్షేమాన్నికాంక్షించి తెలంగాణా ఇచ్చిన ఘనత సోనియా గాంధీ దని ఆయన అన్నారు.

కాని బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం తెలంగాణా ప్రజలను దగా చేసిందన్నారు. ఇక్కడి ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన ఎమ్మెల్యే జోగు రామన్నకు ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి పేదల బతుకులతో ఆడుకుంటున్నాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే పార్టీఅన్నారు. వచ్చే ఎన్నికలలో చేతి గుర్తుకే ఓటేసి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు.హస్తం గుర్తు కే ఓటేస్తామని గ్రామస్తులతో కంది శ్రీనివాస రెడ్డి ప్రమాణం చేయించారు.

జోగురామన్న ఇచ్చే విందు తీసుకోండి ,పైసలు తీసుకోండి కాని ఓటు మాత్రం చేతి గుర్తుకు వేయండని ప్రజలను కోరారు. అటు గ్రామస్తులు కూడా కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తుకు తెచ్చుకొని చేతి గుర్తుకే ఓటేస్తామని అన్నారు. ఆదిలాబాద్‌ లో కంది శ్రీనివాస రెడ్డి గెలుపు ఖాయమన్నారు. కార్యక్రమంలో ఖీ సెల్‌ జిల్లా చైర్మెన్‌ షెడ్మకి ఆనందరావు ,వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుంర భీంరావ్‌ , ఐనేని సంతోష్‌ రావు , పోతారాజు సంతోష్, మనోజ్, రామ్‌ రెడ్డి మోతిరాం, సంబు, జగ్గెరావు, రామారావు, జంగు, బిక్కు, బజ్జు, దేవమ్మ, పారుబాయ్, గ్రామస్థులు పాల్గొన్నారు.

ANN TOP 10