జల్లికట్టుకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. జల్లికట్టు పోటీలపై ఎలాంటి నిషేదం లేదని చెప్పింది. గతంలో ఇచ్చిన తీర్పును కొట్టేసిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. జల్లికట్టుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసింది.
2017 జల్లికట్లును అనుమతిస్తూ చట్టం చేసింది తమిళనాడుప్రభుత్వం. జల్లికట్టు తమిళనాడు ప్రతీక అని.. పోటీల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తామని కోర్టుకు లిఖిత పూర్వక హామీ ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం.
శాసనసభ అభిప్రాయాన్ని తీసుకున్నందున ఇది రాష్ట్ర సాంస్కృతిక వారసత్వంలో భాగమని జస్టిస్ KM జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఇది తమిళనాడు సంస్కృతి అని వారసత్వంలో భాగంగా ప్రకటించబడిందని తెలిపింది.









