AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నావి అన్నం పెట్టే చేతులు .. కడుపు కొట్టే చేతులు కాదు :కంది శ్రీనివాస రెడ్డి

ఆదిలాబాద్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి ప్రజాక్షేత్రంలో బిజీబిజీగా ఉంటున్నారు. నిత్యం గ్రామాల పర్యటనతో’ప్రజలతో మమేకం అవుతున్నారు. నేడు అయన జైనథ్ మండలం గుమ్మ గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. దత్త మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.జైన‌థ్ ఆల‌య అభివృద్ధికి జోగు రామ‌న్న ఒక్క రూపాయి కేటాయించలేదని అన్నారు. గిమ్మ గ్రామం నుండి జోగురామ‌న్న ప‌త‌నం ప్రారంభమైందని తెలిపారు. జోగురామ‌న్న రూ.5 వేల కోట్లు ఎలా సంపాదించుకున్నారని నిలదీశారు.15 ఏళ్లుగా మోసపోతున్నాం అని.. ఇప్పటికైనా మేల్కొని జోగు రామ‌న్నకు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజలు అలోచించి ఓటేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద‌ల పార్టీ అని.. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ప్రజ‌ల బ‌తుకులు మారుతాయని చెప్పారు. కార్యక‌ర్తలే కాంగ్రెస్ బలం అని, కాంగ్రెస్ పార్టీ నుండి ఇత‌ర పార్టీలోకి వెళ్లిన వారు తిరిగిరావాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నిక‌ల‌లో తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని.. దేశంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వ‌స్తోందని చెప్పారు.

ఆదిలాబాద్ అభివృద్ధి చేయ‌డానికే వచ్చానని,నిత్యం ప్రజ‌ల్లోనే ఉంటున్నానని తెలిపారు కంది శ్రీనివాస రెడ్డి. రోజూ వంద‌లాది మందికి అన్నం పెడుతున్నా అని.. తన ప్రాణం ఉన్నంత‌వ‌ర‌కు అన్నదానం కొనసాగుతుందని చెప్పారు.జోగు రామ‌న్న కేసుల‌తో భ‌యపెట్టాల‌ని చూస్తున్నారని.. అన్నం పెట్టే చేతులు నావి.. కడుపు కొట్టే చేతులు కాదని అన్నారు. ల‌క్షసార్లు జైల్లో పెట్టినా.. ప్రశ్నిస్తునే ఉంటానని స్పష్టం చేశారు. ప్రజ‌ల‌ను న‌మ్ముకొని రాజ‌కీయాల్లోకి వచ్చానని,ఆదిలాబాద్ ప్రజ‌లు ఆత్మగౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టరని నమ్ముతున్నానని చెప్పారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోరుకునే వాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరాలని సూచించారు. ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిల‌బెట్టుకుంటుందని అన్నారు.ఒక మంచి ప‌రిశ్రమను ఆదిలాబాద్‌కు తీసుకురావాల‌నేది తన జీవితాశ‌యం అని పేర్కొన్నారు.

ANN TOP 10