AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శివకుమార్ ను ఒప్పించడంలో సోనియాగాంధీ కీ రోల్

కర్నాటక తదుపరి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాగా, డీకే శివకుమార్ ఉప మంత్రి అవుతారు. దీని అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ పార్టీ పెద్దలు ఇదే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. పార్టీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, పార్టీ నాయకులు బుధవారం రాత్రే దీనికి ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి కావాలనే పట్టుదలతో ఉన్న శివకుమార్ ఇప్పుడు ఆయన్ను ఒప్పించడంలో పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీ రోల్ పోషించినట్లుగా సమాాచారం.

సోనియా గాంధీ జోక్యంతో డీకే శివకుమార్ కర్నాటక ఉపముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సోనియాగాంధీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి పదవికి అంగీకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోనియాగాంధీతో మాట్లాడే ముందు శివకుమార్ ముఖ్యమంత్రి కావాలనే పట్టుదలతోనే ఉన్నారు.

కర్ణాటకలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పేర్లను అధికారికంగా ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. కర్ణాటక ఎన్నికల్లో విజయం వెనుక డీకే శివకుమార్‌ పాత్ర ఎంతో ఉంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వచ్చిన చాలా మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా ఆయనకే ఉంది. సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరూ నిన్న అంటే బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు.

ANN TOP 10