..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడదెబ్బతో నలుగురు మృతి చెందారు. సంగం మండలం గౌచర్లకు చెందిన పావని ప్రియాంక ఉపాధి హామీ కూలి పనులకు వెళ్లి వడదెబ్బకు చనిపోయింది.మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కేంద్రానికి చెందిన ఇస్లావత్ సీతారాం, మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బానోతు రాంచి,తొర్రూరు మండలం గుర్తూర్ కు చెందిన యువకుడు రాజు ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ తగిలి మరణించారు.
కాగా కొన్నిరోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , ఎండకు ఎవ్వరు బయటకు రావొద్దని వాతావరణ శాఖా అధికారులు హెచ్చరిస్తున్నారు.









