AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

షర్మిల పై కేసు నమోదు

వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బీఆర్ఎస్ కార్యకర్త ఒకరు షాక్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.దీంతో షర్మిలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.పోలీసులు షర్మిలపై సెక్షన్ 505 (2),504 కింద కేసు నమోదు చేశారు.

ఇక, టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై రియాక్ట్ అయిన షర్మిల కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.‘‘80 వేల పుస్తకాలు చదివి, ఏకంగా రాజ్యాంగాన్నే తిరగరాద్దామన్న మీకు.. ఒక CM సంతకం పెట్టిన అఫిడవిట్ పవర్ ఏమిటో, అది ఇచ్చే ధైర్యం ఏమిటో కొత్తగా చెప్పక్కర్లేదు అనుకుంటా.ఇక తెలంగాణాలో ఎప్పటికీ పేపర్ లీకులు ఉండవు, ఇది కేసీఆర్ మాట అని అఫిడవిట్ మీద ఒక పెట్టి రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో భరోసా నింపాలి’’ అని షర్మిల సవాల్ విసిరారు.

ANN TOP 10