కొత్త సచివాలయంలో
రాష్ట్ర మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ కొత్త సచివాలయంలో ఇదే మొదటి క్యాబినెట్ సమావేశం కానుంది. ఇందుకోసం సాధారణ పరిపాలన శాఖ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఎజెండాలో 20కి పైగా అంశాలు ఉండే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ అనుమతితో ఈసారి ఎక్కువ అంశాలు టేబుల్ ఎజెండాగానే మంత్రివర్గం ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
మంత్రివర్గంలో చర్చించి ముఖ్యమంత్రి కెసిఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. గురువారం(మే 18) మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో సమీకృత కొత్త సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం మొదటిసారి సమావేశం కాబోతోంది. మంజీరా కార్పొరేషన్ ఏర్పాటు ఆమోదం, ర్యాటిఫికేషన్ కోసం అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లాంటి ఇరిగేషన్ ఫైల్స్‌తో సహా మొత్తం 20కి పైగా అంశాలు ఎజెండాలో ఉండనున్నట్లు సమాచారం.









