AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విచారణకు రాలేనని అవినాశ్ లేఖ..

హాజరుకావాల్సిందే.. సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకాందరెడ్డి హత్య కేసు లో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ మరోసారి విచారణ కోసం పిలిచిన సంగతి తెలిసిందే. అయితే విచారణకు హాజరుపై సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు. షార్ట్‌ నోటీసుతో విచారణకు పిలిచారని.. వివిధ పనుల్లో నిమగ్నమై ఉన్నానని తెలిపారు. అత్యవసర పనులు ఉన్నాయని.. 3-4 రోజుల సమయం కావాలని సీబీఐని కోరారు. ముందస్తు షెడ్యూల్ కారణంగా రాలేకపోతున్నానని.. 4 రోజుల తర్వాత విచారణకు వస్తాన్నారు. ఆయన హైదరాబాద్ నుంచి కడపకు బయల్దేరి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఎంపీ అవినాష్‌ రెడ్డి (Kadapa MP Avinash Reddy) రాసిన లేఖను సీబీఐ రిజెక్ట్ చేసింది. విచారణకు హాజరుకావాల్సిందే అంటూ సీబీఐ అధికారులు (CBI Officers) ఆదేశాలు జారీ చేశారు.

విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అవినాశ్ రెడ్డి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే ఉన్నారు. సీబీఐ నుంచి సమాచారం తరువాత పులివెందుల వెళ్లాలని నిర్ణయించారు. ఈరోజు సాయంత్రం వరకు విచారణ రాకపోతే అరెస్ట్ చేస్తారని చర్చ జోరుగా వినిపిస్తోంది. అయితే అవినాష్ అభ్యర్ధనను సీబీఐ తిరస్కరించిన నేపథ్యంలో ఎంపీ విచారణపై సర్వాత్రా ఉత్కంఠ నెలకొంది.

ANN TOP 10