AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సిద్ధరామయ్యతో ఎలాంటి విభేదాలు లేవు.. డీకే శివకుమార్

బెంగళూరు: కాంగ్రెస్ (Congress) పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని, పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah)తో తనకు ఎలాంటి విభేదాలు లేవని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) అన్నారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని చెప్పారు. కాంగ్రెస్ సీఎం ఎంపిక కోసం కీలకమైన కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు జరగనుండటం, సీఎం రేసులో డీకే కూడా ఉండటంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

”సిద్ధరామయ్యతో విభేదాలు ఉన్నట్టు కొందరు అంటున్నారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు” అని తుంకూరులో ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ డీకే స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కోసం చాలాసార్లు తాను త్యాగాలు చేశానని కూడా చెప్పారు. చాలాసార్లు త్యాగాలు చేసి సిద్ధరామయ్య వెన్నంటే ఉన్నానని, తనకు సహనమే లేకుంటే మొదట్లోనే తాను మంత్రిని అయ్యే వాడిని కాదని, సిద్ధరామయ్యకు సహకరించేవాడిని కానని చెప్పారు.

ANN TOP 10