AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. ఇక భానుడి భగభగలే..

కొద్దిరోజులుగా వర్షాలు తగ్గి రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. గత నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత బాగా పెరిగింది. ఎండ ప్రభావంతో పాటు వడగాల్పుల తీవ్రత బాగా ఎక్కువైంది. అలాగే ఉక్కబోత కూడా ఎక్కువ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశముందని స్పష్టం చేసింది. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప పగటిపూట బయటకు రావొద్దని సూచనలు చేసింది. ఈ మేరకు శనివారం రాత్రి హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెదర్ బెలిటెన్ విడుదల చేసింది. 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, ఎండ ప్రతాపంతో పాటు వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది.

ANN TOP 10