డిప్యూటీగా డీకే..!
కర్ణాటక సీఎం పదవి రేసులో సిద్ధరామయ్య ముందున్నారని, కాంగ్రెస్ అధిష్ఠానం సైతం ఆయనను సీఎం చేసేందుకు సానుకూలంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. డీకే కష్టానికి తగినట్టుగా ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వునున్నట్టు చెబుతున్నారు. కీలకమైన మంత్రిపదవిని కూడా ఆయనకు కాంగ్రెస్ ఆఫర్ చేయనున్నట్టు ఆ వర్గాలు ఉంటున్నాయి. సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి వి.సోమన్నపై గెలుపొందగా, డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీచేసి తన ప్రత్యర్థి జేడీయూ నేత బి.నాగరాజుపై 1,22,392 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు.









