AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గర్భిణులకు జగన్ గుడ్ న్యూస్.. ఫ్రీగా స్కానింగ్

ఏపీలో నవరత్నాల పథకాలతో దూసుకెళ్తున్న జగన్ సర్కార్ మరో కొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో గర్భిణులకు అత్యాధునిక టిఫా స్కానింగ్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కాన్‌ను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కార్డుదారులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా అందించనున్నారు.

గర్భిణుల ఆరోగ్యం కోసం…
రేడియాలజిస్టులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన స్పష్టంచేశారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లోనూ టిఫా స్కానింగ్ సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తేల్చిచెప్పారు. పుట్టబోయే శిశువులు ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణుల ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం అనే ఉద్దేశంతో గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు, గర్భిణులకు మధ్య ఒక అనుబంధ వ్యవస్థ ఏర్పాటైనట్టు తెలిపారు.

టిఫా స్కానింగ్
ఈ టిఫా స్కాన్‌ను తల్లి గర్భంలో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని, పిండం ఎదుగుదలలో లోపాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఒక్కో టిఫా స్కాన్‌కు 1,100 రూపాయిలు, అల్ట్రాసోనోగ్రామ్‌ స్కాన్‌కు 250 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. టిఫా స్కానింగ్‌ టెస్ట్ ద్వారా గర్భంలోని శిశువుల ఎదుగుదలలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించి, ముందుగానే జాగ్రత్తపడేందుకు వీలు కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు తెలిపారు. గర్భిణులకు టిఫా, అల్ట్రాసోనోగ్రామ్‌ స్కాన్‌ చేయడానికి వీలుగా వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచామని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సీఈవో ఎం.ఎన్ హరేందిరప్రసాద్‌ తెలిపారు.

ANN TOP 10