బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హిందూ ఏక్తా యాత్రకు సర్వం సిద్ధమైంది.కరీంనగర్ పట్టణంలో ఈ యాత్ర నిర్వహిస్తారు.అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. హిందువుల సంఘటిత శక్తి చాటడమే ప్రధాన లక్ష్యంగా బండి సంజయ్ ఈ యాత్రకు సిద్ధమయ్యారు.కరీంనగర్ లోని ఆర్యవైశ్య భవన్ వద్ద ప్రారంభమయ్యే ఈ యాత్ర.. రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, శాస్త్రి రోడ్డు, కమాన్ చౌరస్తా, బస్టాండ్, తెలంగాణ చౌక్, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ చౌరస్తా మీదుగా తిరిగి ఆర్యవైశ్య భవన్ కు చేరుకుంటుంది. హిందువులంతా స్వచ్చందంగా ఈ యాత్రకు రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.









