AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించేందుకు యత్నం.. మోతీనగర్ లో టెన్షన్ టెన్షన్

జూబ్లీహిల్స్ లోని మోతీనగర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దివంగత నేత, సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం రాజుకుంది.ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో మోతీనగర్ లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. కానీ విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదని విగ్రహాన్ని తొలగించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు అక్కడకు చేరుకున్నారు. అధికారులతో పాటు భారీగా పోలీసులు మోహరించడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుట్రపూరితంగా విగ్రహాన్ని తొలగిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ANN TOP 10