తెలంగాణ రాష్ట్ర పదో ఆవిర్భావ దినోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ ఉత్సవాలు తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఘనకీర్తి దశదిశలా చాటేలా, ప్రతి హృదయం ఉప్పొంగేలా నిర్వహించాలని అధికారులకు సూచించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు జూన్ 2వ తేదీ నుంచి 21 రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేదర్ తెలంగాణ సచివాలయంలో మొదటి రోజు ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అదేరోజు రాష్ట్ర మంత్రులు వారివారి జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడుతారు. ఉత్సవాల నిర్వహణపై సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం శనివారం సమీక్ష నిర్వహించారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 2023 జూన్ 2వ తేదీ నాటికి తొమ్మిదేండ్లు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం.









