AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఆర్ఆర్ నాయకత్వంలో ఆదిలాబాద్ లో కాంగ్రెస్ ను గెలిపిస్తాం: కేఎస్సార్

కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీమంత్రి రామచంద్రారెడ్డి నేటి తరానికి ఎంతో ఆదర్శమని కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత తొలిసారి ఆదిలాబాద్ కు వెళ్లిన కంది శ్రీనివాస రెడ్డి.. సీఆర్ఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి అండదండ అని తెలిపారు. కాంగ్రెస్ వీడిన వారంతా మళ్లీ పార్టీలోకి రావాలని.. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. సీఆర్ఆర్ నాయకత్వంలో అందరం కలిసి పని చేద్దామని.. జోగురామన్నను ఓడించి ప్రజలకు సేవలు చేద్దామని సూచించారు.

ANN TOP 10