కర్నాటక సీఎం ఎవరూ అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. అధిష్టానం సిద్ధరామయ్యకు అవకాశమిస్తుందా? లేక శివకుమార్ కు పట్టం కడుతుందా అనేది క్లారిటీ లేదు.ఈ క్రమంలో నేడు సాయంత్రం బెంగళూరులో సీఎల్పీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కర్ణాటక సీఎం అభ్యర్థిని ఖరారు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాగా రెండున్నరేళ్లు సిద్ధరామయ్య, మరో రెండున్నరేళ్లు డీకే శివకుమార్‌కు సీఎం పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తునట్టు తెలుస్తోంది.









