ఎమ్మెల్యే జోగు రామన్న, ఆదిలాబాద్ జిల్లా పాయల్ శంకర్ మధ్య అనేక లావాదేవీలు జరిగాయని, అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని కంది శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాయల్ శంకర్ జోగు రామన్న కోవర్ట్ అని, జోగు రామన్న కళ్లల్లో ఆనందం చూసేందుకే పాయల్ శంకర్ పని చేస్తారని ఆరోపించారు. ఆదిలాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లలో జోగురామన్న ఆదిలాబాద్ కు ఏం చేయలేదని.. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు.స్కాలర్ షిప్ లు ఇవ్వకుండ విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.పేదల కోసం కాంగ్రెస్ పార్టీ అనేక పనులు చేసిందని అన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుతో పార్టీలో ఉత్సాహం రెట్టింపు అయ్యిందని, తెలంగాణలోనూ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.









