యువనేత, కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస రెడ్డికి ఆదిలాబాద్ లో ఘనస్వాగతం లభించింది. ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన ఆదిలాబాద్ కు వెళ్లారు. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూలదండలు,శాలువాలతో సత్కరించి స్వాగతం పలికారు. కంది శ్రీనన్న నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆయన భారీ కాన్వాయ్ తో జైనథ్ మండలానికి బయలుదేరారు. జైనథ్ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సీఆర్ఆర్ ఆశీస్సులు తీసుకుంటారు.









