కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీకి అభినందనలు తెలిపారు. మహాత్మాగాంధీలా రాహుల్ గాంధీ ప్రజల హృదయాలను గెలుచుకున్నారని.. నమ్మశక్యమైన మీ విధానం ప్రజలకు స్వచ్చమైన గాలిని అందించిందని ట్వీట్ చేశారు. విభజన రాజకీయాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించి రాహుల్ పై విశ్వాసం ఉంచారని తెలిపారు. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా కమల్ హాసన్ కాంగ్రెస్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.ఈ క్రమలో ఇటీవల తమిళనాడులో జరిగిన ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నికలోనూ కమల్ హాసన్ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. అంతకు ముందు భారత్ జోడో యాత్రలోనూ రాహుల్‌కు మద్దతుగా కమల్ పాదయాత్రలో నడిచారు. కర్ణాటక ఫలితాల నేపథ్యంలో కమల్ హాసన్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది.









