AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భక్తులతో కిటకిటాడుతున్న వేములవాడ

హనుమాన్ భక్తుల నామస్మరణలతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం మారుమోగుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుని భక్తులు వేములవాడ రాజన్నను దర్శించుకుని,కొండగట్టుకు వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఈ మేరకు హనుమాన్ దీక్షపరులు రాజన్న ఆలయానికి పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. కోడెమొక్కులు చెల్లించి స్వామివారి దర్శించుకుని తరించారు.రద్దీ అధికంగా ఉండటంతో స్వామివారిని దర్శనానికి దాదాపు 3 గంటల పైగా సమయం పడుతుంది.భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.

ANN TOP 10