AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ధాన్యం రాశి దగ్గరే అన్నదాత కన్నుమూత.. ఈదులూరులో తీవ్ర విషాదం

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. పండించిన ధాన్యం అమ్ముకోడానికి కొనుగోలు కేంద్రానికి వచ్చి ఓ రైతు.. ధాన్యం రాశి దగ్గరే కన్నుమూశాడు. ఈదులూరు గ్రామానికి చెందిన గుయ్యం ఎల్లయ్య నెల రోజుల క్రితం ఐకేపీ సెంటర్ కు ధాన్య తీసుకొచ్చాడు. మందకొడిగా కొనుగోళ్లు జరగుతుండటంతో ఉదయం, సాయంత్రం ధాన్యానికి కాపలాగా అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే వడ్లకుప్పను రాశిగా పోసి.. పక్కనే గుడి దగ్గర కూర్చుని మాట్లాడుతు మాట్లాడుతూ తుదిశ్వాస విడిచాడు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని.. ప్రభుత్వం న్యాయం చేయాలని ఐకేపీ సెంటర్ లో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.నెల రోజులకు పైగా ఐకేపీ సెంటర్ లో ఉన్న వడ్ల కుప్ప వద్ద రైతు ఎల్లయ్య కాపలా కాస్తున్నాడని.. ఎండకు తట్టుకోలేకపోయాడని మృతుని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు టైం కు ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ ఐకేపీ సెంటర్ చుట్టూ తిరిగి.. తిరిగి.. చనిపోయాడని మృతుని బంధువులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

ANN TOP 10