కర్ణాటక ప్రజలు బీజేపీ మత రాజకీయాలను తిప్పి కొట్టి కాంగ్రెస్ ను గెలిపించారని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంతో.. వేములవాడ రాజన్న ఆలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ అధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు.రాజన్న గుడి ముందు కొబ్బరి కాయలు కొట్టి, స్వీట్స్ పంపిణీ చేసి టపాసులు పేల్చారు.బీజేపి మత రాజకీయాలను ప్రజలు నమ్మలేదని అన్నారు.తెలంగాణలోనూ కేసీఆర్ అమలు కానీ హామీలను, మతతత్వ బీజేపీని తిప్పికొట్టి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకు వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వేములవాడ రాజన్న సాక్షిగా చెబుతున్నా.. బీజేపీ మత రాజకీయాలు బంద్ చేయాలని, తెలంగాణలో మత రాజకీయాలు వాడే ప్రయత్నం చేయొద్దని సూచించారు. కర్ణాటక లాగే తామంత ఐక్యంగా ఉండి తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తామని చెప్పారు.









