వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇంజక్షన్ వికటించి రోగి మరణించాడని బంధువుల ఆందోళనకు దిగారు. నిన్న రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి ఎంజీఎంలో అడ్మిట్ అయిన రాములు అనే వ్యక్తికి.. ఆరోగ్య శ్రీ అప్రూవల్ వచ్చాక డాక్టర్లు ఆపరేషన్ చేస్తామని చెప్పారు.ఈ రోజు అప్రూవల్ రావడంతో సర్జరీకి సిద్ధమైయ్యారు. సర్జరీ కోసం డాక్టర్లు మూడు ఇంజెక్షన్లు ఇచ్చిన 5 నిమిషాలకే .. రాములు మృతిచెందాడు. దీంతో ఇంజెక్షన్లు వికటించి రాములు మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు బైఠాయించారు. వైద్యం అందించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.









