కర్నాటకలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వానికి మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. దక్షిణాది నుంచే బీజేపీ పతనం ప్రారంభమైందని హరీష్ రావు పేర్కొన్నారు. బీజేపీకి ప్రతిచోటా ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు వస్తే గొప్ప అని కామెంట్ చేశారు.









