AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కర్నాటకలో దండుపాళ్యం ముఠాలు ఒక్కటయ్యాయి:బండి

కర్నాటక ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు.కర్నాటక రిజల్ట్స్ తెలంగాణపై ప్రభావం చూపవని అన్నారు. బీజేపీ ఓటింగ్‌ పర్సింటేజ్‌ తగ్గలేదని కానీ సీట్లు తగ్గాయని చెప్పారు.కరీంనగర్ లోని తన కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నాటకలో కాంగ్రెస్‌ గెలిస్తే బీఆర్ఎస్‌ సంబరపడుతోందని.. తెలంగాణలోనూ బీఆర్ఎస్‌,కాంగ్రెస్‌ కలిసి పోటీచేస్తాయని అన్నారు. జేడీఎస్‌ అధ్యక్షుడే కాంగ్రెస్‌కు ఓటేయాలని చెప్పాడని, కర్నాటకలో దండుపాళ్యం ముఠాలు ఒక్కటయ్యాయని విమర్శించారు.

ANN TOP 10