AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈగోలు పక్కన పెట్టాలి.. టీకాంగ్రెస్ లీడర్లకు వీహెచ్ కీలక సూచన

టీకాంగ్రెస్ నేతలు ఈగోలు పక్కన పెట్టాలని.. టీపీసీసీ ఇంఛార్జ్ మానిక్ ఠాక్రేతో చర్చించి విభేధాల్లేకుండా చూసుకోవాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ.హనుమంతారావు సూచించారు. కర్నాటక రిజల్ట్ పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో కాంగ్రెస్‌ది మామూలు విజయం కాదని.. ఈ విజయం యావత్‌ దేశప్రజల విజయమని తెలిపారు.రాహుల్‌ గాంధీ తన పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారని, 2024లో రాహుల్ దేశ ప్రధాని అవుతారని అన్నారు. ఇక 2024లో 1980 చరిత్ర రిపీట్ అవుతుందని.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారన్నారని.. గతంలో కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందో.. ఇప్పుడు ఏం చేస్తుందో ప్రజలకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.

ANN TOP 10