కర్నాటక విజయంపై గాంధీభవన్ లో టీకాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు.తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు స్వీట్లు తినిపించుకున్నారు.అనంతరం మాణిక్ ఠాక్రే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కర్ణాటకలో కుమార స్వామికి మద్దతు ఇచ్చిందని, కాంగ్రెస్ ఓటమికి ప్రయత్నించిందని.. కానీ వారి కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని తెలిపారు.తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.









