AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కౌంటింగ్ మొదలైన గంట తర్వాత ట్రెండ్ ఇదీ..

ఆధిక్యంలోకి దూసుకెళ్లిన కాంగ్రెస్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఉదయం 9 గంటలకు ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసిన డేటా ప్రకారం… కాంగ్రెస్ 12 చోట్ల, బీజేపీ 8 స్థానాల్లో జేడీఎస్ 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి. మేజిగ్ ఫిగర్‌కు కావాల్సిన స్థానాల్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన కాంగ్రెస్. ప్రస్తుతానికి బీజేపీ-కాంగ్రెస్ ఆధిక్యాల మధ్య వ్యత్యాసం మరింత పెరిగింది. కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతానికి కాంగ్రెస్ 114, బీజేపీ 84, జేడీఎస్ 20 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

కౌంటింగ్ మొదలైన గంట తర్వాత పరిస్థితిని గమనిస్తే బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరి పోరు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే కాంగ్రెస్ కాస్త ముందంజలో కనిపిస్తోంది. ఉదయం 9 గంటల సమయంలో కాంగ్రెస్ 109 స్థానాల్లో ముందంజలో. బీజేపీ 83 నియోజకవర్గాల్లో లీడ్‌లో ఉంది. ఇక జేడీఎస్ అభ్యర్థులు 21 నియోజకవర్గాల్లో లీడ్‌లో కొనసాగుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్‌ను చేరుకుంటుందా? లేక బీజేపీ దూసుకెళ్తుందా? లేదా హంగ్ ఖాయమా ? అనే సందేహాలకు మరో గంట లేదా రెండు గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నిన్న రాత్రి సింగపూర్ నుంచి బెంగళూరు చేరుకున్న కుమారస్వామి ఫలితాల ట్రెండ్‌పై స్పందించారు. ఇప్పటివరకు తమను ఏ పార్టీ సంప్రదించలేదని చెప్పారు. ప్రస్తుతానికి తనకు డిమాండ్ లేదని వ్యాఖ్యానించారు.

ANN TOP 10