* గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
* 224 నియోజకవర్గాల నుంచి 2,615 మంది అభ్యర్థులు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంలకు మొదలైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య నువ్వా-నేనా అన్నట్టుగా సాగిన ఎన్నికల పోటీలో ఎవరు గెలుస్తారు? ఎవరు అధికారం దక్కించుకుంటారు? విషయం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. మరోవైపు, గెలుపుపై బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌ల నేతలు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.
అయితే, ఇప్పటి వరకు వచ్చిన సర్వేలను పరిగణనలోకి తీసుకున్న నాయకులు ‘హంగ్’ వస్తే ఏం చేయాలన్న దానిపైనా అంతర్గత చర్చలు జరుపుతున్నారు. మరోవైపు, ఏపార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాకపోతే.. చక్రం తిప్పేందుకు జేడీఎస్ నేత, మాజీ సీఎంకుమారస్వామి కూడా సిద్ధంగా ఉండడం గమనార్హం. ఇదిలావుంటే, శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.









