
ర్ణాటక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి మందకొడిగా కొనసాగిన పోలింగ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. క్యూలైన్లలో జనాలు కనిపిస్తున్నారు. భారత మాజీ ప్రధాని దేవెగౌడ కర్ణాటక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధాప్యంలో నడవలేని స్థితిలో ఉన్న దేవెగౌడను ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది చేతులతో పట్టుకొని బూత్‌లోకి తీసుకెళ్లి ఓటు వేయించారు. ఆయనతోపాటు సతీమణి కూడా పోలింగ్ బూత్‌కి వచ్చి ఓటు వేశారు. బూత్ క్యూ లైన్లలో ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ 37.25 శాతంగా నమోదయ్యింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక సమాచారాన్ని విడుదల చేసింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు…
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక ఎన్నికల్లో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. 130 – 135 సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా మల్లికార్జున ఖర్గేతోపాటు ఆయన సతీమణి కూడా కలబురగిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.









