30 ఇయర్స్ ఇండస్ట్ర్ గా గుర్తింపు పొందిన ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కమెడియన్ వందల చిత్రాల్లో నటించిన ఆయన ఇప్పుడు మెగా ఫోన్ పట్టారు. తన కూతురి కోసం దర్శకుడిగా మారి ‘కొత్త రంగుల ప్రపంచం’ సినిమా తెరకెక్కిస్తున్నారు. వరుసగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆయన అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు.
దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి బెడ్ మీదన్న ఆయన నుంచి ఓ వీడియో బయటకు వచ్చింది. ‘‘డైరెక్టర్‌గా తొలి ప్రయత్నం చేశాను. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కూడా సినిమా గురించే ఆలోచిస్తున్నా. ‘కొత్త రంగుల ప్రపంచం’ సినిమాకి అందరి ఆశీస్సులు కావాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.