యువసంఘర్షణ సభ వేదికగా యూత్ డిక్లరేషన్ ను ప్రకటించింది టీకాంగ్రెస్. నిరుద్యోగ సమస్యతో విసిగిపోయిన యువతకు.. చేయందిస్తూ.. పలు కీలక హామీలు ఇచ్చింది. సరూర్ నగర్ సభ వేదికగా టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి యూత్ డిక్లరేషన్ విడుదల చేశారు. ఇందులో అంత్యంత ప్రాముఖ్యమైన అంశాలను పొందిపరిచారు.
అమరులను, ఉద్యమ వీరులను గుర్తించి వారి కుటుంబాలకు రూ.25వేల పెన్షన్ అందిస్తామని.. ఉద్యమకారులపై కేసులు ఎత్తేసి గుర్తింపుకార్డు అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని.. ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి ప్రతీ ఏటా ఖాళీలను భర్తీ చేస్తామని హామి ఇచ్చింది. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేలు భృతి అందించి ఆదుకుంటామని.. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పారదర్శక నియామకాలు చేపడతామని పేర్కొన్నారు.నిరుద్యోగ రహిత రాష్ట్రంగా మార్చేందుకు సెంట్రలైజేడ్ లైన్ విధానం తెస్తామని.. విద్యార్థి, నిరుద్యోగులకు ఉపాధి శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగులకు 75శాతం అవకాశాలు కల్పించేలా చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ తరహాలో యూత్ కమిషన్ ద్వారా యువతను ఆదుకుంటామని ప్రకటించారు.
రూ.10లక్షలు వడ్డీ లేని రుణాలు అందిస్తామని.. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక చట్టం తెచ్చి ఆదుకుంటామని చెప్పారు. భవిష్యత్ లో ఒక్కరు కూడా ఏజెంట్ల చేతిలో మోసపోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, విద్యార్థుల కోసం ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాలో నూతన యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.బాసర IIT తరహలో మరో నాలుగు IITలు ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసులు, ఆర్టీసీ కార్మికుల కోసం వరంగల్, హైదరాబాద్ లో ప్రత్యేక యూనివర్సిటీలు ఏర్పాటు.. వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. యువమహిళా సాధికారతలో భాగంగా చదువుకునే విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీ అందిస్తామని చెప్పారు.
‘యువత భవితే కాంగ్రెస్ నినాదం.. అమరుల ఆశయ సాధన కాంగ్రెస్ విధానం’ అని.. ‘ప్రియాంక గాంధీ నయా ఇందిరమ్మ’ అని తెలిపారు.









