AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సోనియమ్మ బిడ్డగా మాట ఇస్తున్నా.. : ప్రియాంక గాంధీ

యువ సంఘర్షణ సభలో పవర్ ఫుల్ స్పీచ్ తో ఆకట్టుకున్నారు ప్రియాంక గాంధీ. జై బోలో తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించిన ప్రియాంక..రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

తెలంగాణ అమరవీరులు ఏ ఆకాంక్షల కోసం ఉద్యమం చేశారో ఆ లక్ష్యం నెరవేరలేదని.. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని చెప్పారు. శ్రీకాంతాచారి లాంటి ఎంతో మంది విద్యార్థులు తెలంగాణ కోసం ప్రాణాలు వదిలారని..తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని భావించామని, కానీ తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం తమ జాగీరుగా భావిస్తోందని మండిపడ్డారు. తాము జాగీర్దారులమని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వానికి పట్టడం లేదని ఫైర్ అయ్యారు.

కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారని.. ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా?అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు.రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయలేదు కానీ, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేయరు కానీ, ప్రైవేటు యూనివర్సిటీలకు వెంటనే అనుమతులు ఇస్తున్నారు అని విమర్శించారు.ఇలాంటి ప్రభుత్వానికి బుద్ది చెప్పాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. దేశంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ చేసిన పనులను పేర్లు మార్చి తమవిగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

‘సోనియమ్మ బిడ్డగా మాట ఇస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూత్ డిక్లరేషన్ అమలు చేసి తీరతాం’ అని స్పష్టం చేశారు.

ANN TOP 10