టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రసంగంతో యువ సంఘర్షణ సభ దద్దరిల్లింది.నిరుద్యోగ సమస్యలపై, బంగారు తెలంగాణ సాధనపై, కాంగ్రెస్ భరోసాపై రేవంత్ కీలక ప్రసంగం చేశారు.
ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు అంటే కేవలం విశ్వవిద్యాలయాలు మాత్రమే కాదని.. తెలంగాణ పౌరుషానికి వేదికలు అని తెలిపారు. మా కొలువులు మాకు కావాలనే ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమం పుట్టిందని, ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 12.50 లక్షలు ఉంటే.. విభజన తరువాత తెలంగాణకు 5.30లక్షలు ఉద్యోగులను కేటాయించారన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 1.7 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్.. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరగదన్నారు. నిరుద్యోగులకు అండగా నిలబడేందుకు ప్రియాంక గాంధీ ఇక్కడకు వచ్చారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను అమలు చేస్తామని చెప్పారు.









