కొని తెచ్చికున్న తెలంగాణలో ఉద్యోగాలు లేక తెలంగాణ యువత బాధ పడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. యువసంఘర్షణ సభలో ఆయన మాట్లాడుతూ.. కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్లు ఉందని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు.తెలంగాణ యువతకు భరోసా ఇచ్చేందుకు ప్రియాంక గాంధీ హైదరాబాద్ కు వచ్చారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తో అందరం చెయ్యి చెయ్యి కలుపుదామని, కలలు కన్న బంగారు తెలంగాణను సాధించుకుందామని.. విద్యార్ది లోకం ఏకం కావాలని పిలుపునిచ్చారు.









