ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రియాంకకు.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్,సీనియర్ నాయకులు కోదండరెడ్డి, నిరంజన్, హర్కర వేణుగోపాల్,తదితరులు ఘన స్వాగతం పలికారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారి తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి ప్రియాంక గాంధీ హెలికాప్టర్‌లో సరూర్ నగర్ స్టేడియానికి బయలుదేరనున్నారు. కాగా యువ సంఘర్షణ సభలో పాల్గొనేందుకు ప్రియాంక తెలంగాణ వచ్చారు. ఈ సభలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ విడుదల చేయనున్నారు.









