AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్యే రాసిచ్చిన బాండ్ కు పిండ ప్రదానం

ఎమ్మెల్యే రాసిచ్చిన బాండ్ పేపర్ కు పిండ ప్రదానం చేసి పాలకులపై అసహనాన్ని వ్యక్తం చేశారు జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం కొండ్రికర్ల గ్రామస్తులు.

గ్రామ శివారులోని వాగుపై రెండు సంవత్సరాల్లో వంతెన నిర్మిస్తానని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు నాలుగేళ్ల క్రితం గ్రామస్తులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. ఎంపీటీసీ ఎలక్షన్ల సమయంలో వెల్లుల్ల గ్రామానికి చెందిన మారుసాయి రెడ్డిని గెలిపిస్తే.. ఆయనను ఎంపీపీగా నియమించి రెండు సంవత్సరాల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే బాండ్ రాసిచ్చి నాలుగేళ్లవుతున్నా.. ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఆ బాండ్ పేపర్ కు వాగులో పిండ ప్రదానం నిరసన వ్యక్తం చేశారు.

ANN TOP 10