AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అక్క భర్తతో ఉడాయించిన పెళ్లికూతురు..

తెల్లారితే పెళ్లి.. ఇళ్లంతా సందడి.. అతిథులతో కళకళ.. సంతోషంలో కుటుంబ సభ్యులు..అలాంటి పండుగ వాతావరణంలో కల్లోలం సృష్టించింది ఓ యువతి.

జగిత్యాల రూరల్ మండలంలో కన్నాపూర్ గ్రామానికి చెందిన ఓ యువతికి మల్యాల మండలం లంబడిపల్లి గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. మే 7న ఉదయం 11 గంటలకు పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేశారు. ముందురోజు వివాహ వేడుకలకు సర్వం సిద్ధం చేసింది యువతి కుటుంబం.ఎక్కడా.. ఏదీ తక్కువ చేయకుండా సకల ఏర్పాట్లు చేశారు. అయితే పెళ్లిరోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి .. పెళ్లి కూతురు కనిపించలేదు. ఏమైందోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. యువతి కోసం గాలించిన కుటుంబ సభ్యులు.. అసలు విషయం తెలిసి ఖంగుతున్నారు. సొంత అక్క భర్తతోనే పెళ్లికూతురు వెళ్లిపోయిందని తెలుసుకుని షాక్ గురయ్యారు. చెల్లి వివాహానికి వస్తే.. తన భర్త ప్రేమ పేరుతో ఆమెను తీసుకెళ్లడంతో యువతి అక్క ఆందోళనకు గురైంది

ANN TOP 10