AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాయల్ లుక్ లో తలైవా.. లాల్ సలాం లుక్స్ తో ఫ్యాన్స్ కు కిక్కే

రజినీ కాంత్ అభిమానులకు జోష్ ఇచ్చే వార్త చెప్పింది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. భారీ బడ్జెట్ సినిమాలు రూపొందిస్తున్న లైకా.. రీసెంట్‌గా విడుద‌లైన ‘పొన్నియిన్ సెల్వన్ 2’తో సూపర్ సక్సెస్‌ను సాధించిన విషయం తెలసిందే.అయితే ఇదే లైకా నుంచి రానున్న మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’. ఐశ్వ‌ర్య రజినీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రజినీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ‘లాల్ సలాం’ చిత్రంలో మొయిద్దీన్ భాయ్’ క్యారెక్టర్‌ కు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో రజినీకాంత్ ముస్లిం గెటప్ లో రాయల్ నడిచివస్తునట్టు కనిపించారు. రజినీకాంత్‌ పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేయ‌టం చాలా హ్యాపీగా ఉందని చిత్రబృందం తెలిపింది.

ANN TOP 10