ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొంతకాలంగా జైల్లో ఉన్న నిందితుడు శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన భార్యకు అనారోగ్యంగా ఉందని.. ఆమె బాగోగులు చూసుకోవాలని.. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టును కోరారు. శరత్ చంద్రారెడ్డి అభ్యర్ధనను ఢిల్లీ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. బెయిల్ మంజూరు చేసింది.2022 నవంబర్ 9న శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను విచారించిన ఈడీ అధికారులు.. విచారణకు సహకరించడం లేదని వారిద్దరినీ ఒకే రోజు అరెస్ట్ చేశారు.









