AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్ ప్రియాంక గాంధీకి క్షమాపణ చెప్పాలి:మల్లు రవి

ప్రియాంక గాంధీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి తీవ్రంగా ఖండించారు. ప్రియాంక గాంధీని పొలిటికల్ టూరిస్ట్ అనడంపై తీవ్రంగా మండిపడ్డారు. గాంధీభవన్ వేదికగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని గాడ్సేతో పోల్చడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. కేటీఆర్ అనాలోచితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పేరుతో వివిధ రాష్ట్రాలు తిరుగుతున్న మీ నాయకులు పొలిటికల్ టూరిస్టులేనా? అని ప్రశ్నించారు. కేటీఆర్ రాజ్యాంగేతర శక్తిగా మారారని మండిపడ్డారు. ప్రియాంక గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదని.. వెంటనే ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ANN TOP 10