AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మణిపూర్ నుంచి హైదరాబాద్ కు విద్యార్థుల తరలింపు

మణిపూర్ అల్లర్లలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు క్షేమంగా హైదరాబాద్ చేరుకుంటున్నారు. 75 మంది విద్యార్థులను అధికారులు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు.మరికొంత మంది కోల్‌కతా మీదుగా సాయంత్రంలోపు హైదరాబాద్ కు రానున్నారు.హైదరాబాద్ చేరుకున్న తర్వాత విద్యార్థులను వారి వారి స్వస్థాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.కాగా మణిపూర్‌ అల్లర్లలో దాదాపు 50 మందికి పైగా చనిపోయారు.దాంతో మణిపూర్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.అయినా అల్లర్లు అదుపులోకి రాకపోవటంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఘటనల నేపథ్యంలో మణిపూర్‌లోని ఇంఫాల్ వర్సిటీతో పాటు వేర్వేరు విద్యాసంస్థల్లో చదుకుంటున్న 103 మంది తెలంగాణ విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా ఇక్కడికి తీసుకురావటానికి తెలుగు ప్రభుత్వాలు ప్రత్యేక విమానాలను పంపాయి.

ANN TOP 10