వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు నీళ్లలోకి జారి పడి మృతి చెందారు.గంధం కురుమన్న ముగ్గురు కుమార్తెలు తిరుపతమ్మ (16), సంధ్య (12), దీపిక (10) గ్రామ సమీపంలోని వీరసముద్రం చెరువులోకి బట్టలు ఉతకడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ఒకరి తర్వాత మరొకరు చెరువు గుంతలో పడి మరణించారు.ఈ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.









