AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉజ్జయిని మహంకాళి బోనాలపై మంత్రి కీలక ప్రకటన

సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలపై మంత్రి తలసాని కీలక ప్రకటన చేశారు. మహాంకాళి బోనాలను జులై 9వ తేదీన నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. జులై 10న భవిష్యవాణి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రి తలసాని పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు.రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల విశిష్టతను రాష్ట్ర ప్రభుత్వం నలుదిక్కులా చాటిందని అన్నారు. బోనాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ANN TOP 10