ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని టీడీపీ ఆధ్వర్యంలో మినీ మహానాడు నిర్వహించారు. పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సత్తుపల్లి పట్టణమంతా పసుపుమయం అయ్యింది. తర్వాత స్థానిక ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు దేశం పార్టీ జెండాను ఎగురవేశారు. కేసీఆర్ అరాచక పాలనను అంతమొందించేందుకు.. తెలుగు దేశం పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు తెలుగు దేశం కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ వేడుకలో అశ్వారావుపేట,సత్తుపల్లి నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు పాల్గొన్నారు.









