కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే కుటుంబం హత్యకు ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు హల్ చల్ చేశాయి.మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఆయన కుటుంబ సభ్యులను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఆరోపించారు.బీజేపీ ఆయన హత్యకు స్కెచ్ వేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.ఇందుకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్‌ని కూడా షేర్ చేసింది కాంగ్రెస్. బీజేపీ నేత కాల్ రికార్డింగ్‌ని ట్విటర్‌లో పోస్ట్ చేసింది. చిత్తాపూర్ బీజేపీ అభ్యర్థి హస్తం ఉందని ఆరోపిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సైతం ఖర్గే హత్య కుట్రను ఖండిస్తున్నారు.ఈ క్రమంలోనే దీనిపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఖర్గే కుటుంబంపై హత్య కుట్రకు పాల్పడుతున్న మణికంఠ నరేంద్ర రాథోడ్ పై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు.









