AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డెలివరీ బాయ్‌గా మారిన రాహుల్ గాంధీ!

ఎన్నికల ప్రచారంతో కర్ణాటక రాజధాని బెంగళూరు హోరెత్తుతోంది. కీలక నేతలు అందరూ అక్కడే మకాం వేశారు. ఈ నేపథ్యంలో.. ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీ.. డెలివరీ బాయ్‌గా మారారు. డెలివరీ బాయ్ స్కూటర్‌పై దాదాపు 2 కిలోమీటర్లు ప్రయాణించారు. రాహుల్ (Rahul Gandhi) రైడ్‌ను అందరూ ఆశ్చర్యంగా చూశారు. చాలా మంది యువకులు రాహుల్ గాంధీ వెంట పరుగులు తీశారు.

అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 4 రోజులు మాత్రమే ఉన్నాయి. దీంతో పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నగరంలో మెగా రోడ్‌షో నిర్వహించారు. న్యూ తిప్పసాంద్ర రోడ్‌లోని కెంపేగౌడ విగ్రహం నుంచి.. ట్రినిటీ సర్కిల్ వరకు మోదీ రోడ్ షో జరిగింది.

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం సందడి
ప్రధాని మోదీని చూసేందుకు.. వీధుల్లో జనం బారులు తీరారు. డ్రమ్స్‌తో సౌండ్ చేస్తూ.. సంగీత వాయిద్యాలను వాయించారు. అంతకుముందు శనివారం కూడా ప్రధాని మోదీ బెంగళూరు నగరంలో దాదాపు 13 నియోజకవర్గాలను కవర్ చేస్తూ.. 26 కి.మీ రోడ్‌షో నిర్వహించారు. ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆదివారం బెళగావి సౌత్ నియోజకవర్గంలో మెగా రోడ్‌షో నిర్వహించారు.

ANN TOP 10