AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చనిపోయిన తల్లి పట్ల బిడ్డల కర్కశం

మృతి చెందిన కన్న తల్లి పట్ల ఎంతో కర్కశంగా ప్రవర్తించారు ఆ బిడ్డలు. అనారోగ్యంతో బాధపడుతున్న కిష్టవ్వ (70) అనే వృద్ధురాలిని కుటుంబసభ్యులు గత నెల 21న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ కిష్టవ్వ నిన్న రాత్రి కన్నుమూసింది. అయితే చనిపోయిన మహిళ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వృద్ధురాలిపై కుటుంబసభ్యులు దాడి చేసినట్లు వైద్యులు తెలిపారు. వృద్ధురాలు కిష్టవ్వ తన పేరిట బ్యాంకులో ఉన్న అమౌంట్‌ను కూతుళ్లకు, కొడుకులకు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో తల్లి చనిపోయిన విషయం తెలిసిన బిడ్డలు.. కోపంతో ఆమె శవాన్ని ఆస్పత్రి వద్దే వదిలేసి వెళ్లిపోయారు. శవాన్ని తీసుకువెళ్లాల్సిందిగా కుటుంబసభ్యులకు ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ శవాన్ని తీసుకెళ్లడానికి నిన్నటి నుంచి రాకుండా కుటుంబసభ్యులు నిరాకరిస్తున్న పరిస్థితి.

ANN TOP 10