తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు సభ్యుడు రాజేష్ ఎన్ కౌంటర్ పై నక్సలైట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టపాడు ఎన్ కౌంటర్ ఓ బూటకపు ఎన్ కౌంటర్ అని.. నిరాయుధుడైన రాజేష్ ను పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని, ఇది పోలీసుల పిరికిపంద చర్యగా భావిస్తున్నట్లు లేఖ ద్వారా తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, సీఐ ఈ హత్యకు పూర్తి బాధ్యత వహించాలని.. భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరిట లేఖను విడుదల చేశారు.









